Thursday, October 27, 2016

పెదవులు పగిలాయా అయితే ఇలా చేయండి చాలు

చలికాలం వచ్చేసిందంటే చాలు………… మృదువుగా ఉన్న పెదవులు గరుకుగా మారుతాయి.  
అలాంటి వారందరూ ఏం చేయాలంటే……….
రాత్రి పడుకునే ముందు పెదవులకు కొబ్బరినూనెను పట్టించాలి.
ఇలా రోజూ చేయడం వల్ల అవి ఎండి పోకుండా ఉంటాయి.

కొందరికి పెదవులు పూర్తిగా పొడిబారి వాటి నుంచి రక్తం వస్తుంటుంది. అలాంటప్పుడు షియా బటర్ రాయాలి. అది గాయాన్ని మాన్పడమే గాక , పెదవులు ఎక్కువసేపు పొడి బారకుండా ఉంటాయి.
ఇంట్లో పేరిన నెయ్యి ఉంటే పెదవులపై రాస్తే , చర్మం ఎక్కువసేపు తేమగా ఉండేట్లుగా చేస్తుంది.
బజారులో దొరికే బీస్ వ్యాక్స్ రాత్రిళ్ళు పెదవులకు రాయడం వల్ల , వాటికి పూర్తి పోషణ అందుతుంది.
పెదవులు పగిలి , నొప్పిగా ఉంటే కలబంద గుణాలున్న లిప్ బాం ను వాడండి.
అది ఇన్ఫెక్షన్లను దూరం చేసి నొప్పినీ తగ్గిస్తుంది.

No comments:

Post a Comment